
9.2kViews
100
Shares
తెలంగాణ మిర్రర్,చేవెళ్ల : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేవెళ్ల మండలం రామన్నగూడ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు బంధువుల తెలిపిన వివరాల ప్రకారం రామన్నగూడ గ్రామానికి చెందిన పెద్దోళ్ల మల్లేష్ వయసు 50స “తండ్రి అనంతయ్య మృతి చెందిన వ్యక్తికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన పొలం సాగుచేయ అప్పులు తెచ్చి చామంతి మొక్కజొన్న పత్తి పంటలు వేశాడు. అతివృష్టి అనావృష్టి వర్షాల కారణంగా పంటలు పెరగక నీట మునగడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలని మనస్థాపం చెంది శనివారం ఉదయం 4 గంటలకు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి డెడ్ బాడీని పోస్టుమార్టంకు చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.