
400Views
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ గుల్ మోహర్ పార్కు కాలనీ, శ్రీ బృందావన క్షేత్రం అద్వర్యములో ఘనంగా దత్త జయంతి మహోత్సవం నిర్వహించారు. ఈ మేరకు హిమాలయ పర్వత తపస్వి శ్రీ సిద్ద యోగి పర్యవేక్షణలో మహా చండి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ చైర్ పర్సన్ రాగం సుజాత నాగేందర్ యాదవ్ పాల్గొని శేరిలింగంపల్లి లోని జిహెచ్ఎంసి సిబ్బందికి,నిరుపేదలకు ఆర్ ఎన్ వై ఫౌండేషన్ అధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు.అనంతరం ఆర్ ఎన్ వై ఫౌండేషన్ సంస్థ నిర్వాహకులు రాగం అనిరుధ్ యాదవ్ అన్నదానం చేశారు.