
తెలంగాణ మిర్రర్, హైదరాబాద్ : నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు పై గరిష్ట వేగ పరిమితిని గంటకు 100 కి. మీ. నుండి 120 కి. మీ. వేగ పరిమితి పెంచుతున్నట్లు తెలంగాణ ఎంఏ అండ్ యుడి ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. మంగళవారం మంత్రి కేటీఆర్ తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. మొదటి రెండు లేన్ లు 80 కి. మీ. నుండి 100 కి. మీ. ఉండగా…తాజాగా గంటకి 120 కి. మీ. వేగ పరిమితిని సవరించారు. ఓఆర్ఆర్ పై ఏదైనా అత్యవసర పరిస్థితి లో ప్రయాణికులు 1066, 105910 నెంబర్ లను ఉపయోగించి సహాయం పొందాలని హెచ్ఎండీఏ సూచించింది.