
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : 2022 నూతన సంవత్సరం నియోజకవర్గ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రేమ, కరుణ, సహనాన్ని పంచుతూ సమసమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్న వారందరినీ ప్రోత్సహించాలని ఆయన ఈ సందర్భంగా ఆయన సూచించారు. ప్రజలు తమ ఆరోగ్యం పై శ్రద్ద చూపాలని సూచించారు. ప్రతి నూతన సంవత్సరం కొత్త అవకాశాలను కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. కరోనా మహమ్మారిని దూరం చేయడానికి మన మందరం కలిసి కట్టుగా ముందుకు సాగాలని, కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.2022 లో సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ సహకారంతో నియోకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.