
1.1kViews
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: నియోజకవర్గం పరిధిలో మాదాపూర్, హాఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో అనేక చోట్లా నూతనంగా చేపట్టిన ఓపెన్ నాల పనులను నాణ్యతతో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర గౌడ్ తెలిపారు.బుధవారం డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ బస్తిలో నిర్మించిన ఓపెన్ నాలపై చేపట్టాల్సిన స్లాబ్ పనులను బస్తి నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పనులను నాణ్యత ప్రమాణాలతో సకాలంలో పూర్తయ్యేలా చూడాలని కాంట్రాక్టర్ కు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆదిత్య నగర్ టీఆర్ఎస్ బస్తి అధ్యక్షులు మునాఫ్ ఖాన్,మైనారిటీ నాయకులు లియాఖత్ ,సలీం,షోయబ్ తదితరులు పాల్గొన్నారు.