
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో జరిగే గణేష్ నిమజ్జనాల సరళిని గురువారం పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ ద్వారా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పర్యవేక్షించారు. పలుమార్లు సీపీ ఆయా జోన్ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు. గణేశ్ నిమజ్జనం ముందస్తుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం జరిగే విధంగా అధికారులకు తగు సూచనలు కూడా జారీచేశారు. సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో జరిగే గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటివరకూ రాజేంద్రనగర్ జోన్ లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పత్తికుంట చెరువు మాదాపూర్ జోన్ లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గంగారం చెరువును మరియు బాలానగర్ జోన్ లోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఐడీఎల్ చెరువు ఇతర చెరువులు వద్ద నిమజ్జన సరళిని సందర్శించారన్నారు. సైబరాబాద్ లో భద్రతకు సంబంధించి 4500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. భద్రత దృష్ట్యా కమీషనరేట్ పరిధిలో డ్రోన్లకు అనుమతి లేదని సీపీ తెలిపారు. సీసీటీవీల ద్వారా మొత్తం నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామన్నారు.ప్