
మాదాపూర్ లో అన్నపూర్ణ క్యాంటిన్ ప్రారంభించిన విప్ గాంధీ
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : తిండికి ఇబ్బంది పడుతున్న పేదలను,యాచకులు అన్నపూర్ణ క్యాంటీన్లు ఆదుకుంటున్నాయని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. జోనల్ కమీషనర్ తో కలిసి మాదాపూర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నపూర్ణ ఉచిత అన్నదాన క్యాంటీన్ని గురువారం విప్ గాంధీ ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిరుపేదలు, యాచకులు ఆకలితో అలమటించకూడదని,వారికి అన్నపూర్ణ క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.లాక్‌డౌన్ కారణంగా తిండికి ఇబ్బంది పడ్డ పేదలను అన్నపూర్ణ క్యాంటీన్లు ఆదుకున్నాయన్నారు.డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టలేని నిరుద్యోగులు,పని మీద సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చిన వారి ఆకలి తీర్చడం కోసం ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేశారు.రూ.5 కే అన్నపూర్ణ క్యాంటీన్లలో నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ అధికారులు ఏఈ శంకర్ నాయక్,ఈఈ శ్రీకాంతిని,డీఈ స్రవంతి,ఏఈ ప్రశాంత్, ఏఎంఓహెచ్ కార్తీక్,మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు శ్రావణ్ యాదవ్,రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.