Home » నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు

నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు

by Admin
420Views

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి:  నియోజకవర్గ లోని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ , చైతన్య నగర్ , సుమిత్ర నగర్, బాగ్అమీర్ కాలనీ లలో రూ. 2 కోట్ల 23 లక్షల 75 వేల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్లు యుజిడి పునరుద్ధరణ నిర్మాణ పనులకు జిహెచ్ఎంసి అధికారులు, కార్పొరేటర్ రోజాదేవి రంగరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివుద్ది ఆగకూడదనే ఉద్దేశ్యం తో సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి కెటిఆర్  సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదితానని గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా వివేకానంద నగర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరం అని అదేవిధంగా వర్షకాలం ను దృష్టిలో పెట్టుకొని సీసీ రోడ్లు యూజిడి  పునరుద్దరణ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించారు.  నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు:

1.వివేకానంద నగర్ కాలనీ లో రూ.132.85 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్డు యుజిడి పునరుద్ధరణ నిర్మాణ పనులు.

2. చైతన్య నగర్, సుమిత్ర నగర్ కాలనీ లలో రూ.19.20 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే యుజిడి  పునరుద్ధరణ నిర్మాణ పనులు

3. బాగ్ అమీర్ కాలనీ లో రూ.71.70 లక్షల అంచనా వ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్డు యుజిడి  పునరుద్ధరణ నిర్మాణ పనులు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు  EE గోవర్ధన్ AE స్వప్న , వర్క్ ఇన్స్పెక్టర్ సుధాకర్, మాజీ కార్పొరేటర్ రంగరావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి , మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు, ,కార్తిక్ రావు,అల్లం మహేష్ ,రామచంద్ర రావు,హిమగిరి రావు,శివరామ కృష్ణ, వేణు, నరసయ్య,విజయ్ బాబు,దేవి నేని ప్రసాద్, చంద్రమోహన్ సాగర్, శ్రీనివాస్ రెడ్డి, రవి, శ్రీరామ్ సంతోషం లడ్డు ప్రసాద్,  నాని , ప్రవీణ్, మురళి, భూమయ్య, మణి కృష్ణ, జగదీష్ గౌడ్, నరహరిరంజిత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment