Home » నియోజకవర్గం అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నాం : ప్రభుత్వ విప్ గాంధీ

నియోజకవర్గం అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నాం : ప్రభుత్వ విప్ గాంధీ

by Admin
420Views

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : ప్రజా సంక్షేమం,నియోజకవర్గం అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్,శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు.సోమవారం ఆయన చందానగర్ డివిజన్ లోని ఇందిరా నగర్,వేముకుంట కాలనీలలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి,జిహెచ్ఎంసి,జలమండలి అధికారులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తూ ఎక్కడ ఎలాంటి సమస్యలున్నాయి, కొనసాగుతూన్న అభివృద్ధి పనుల పురోగమిని తెలుసుకుంటున్నాని తెలిపారు.కాలనీలలో మౌలిక వసతుల కల్పనలో అగ్రగామిగా ఉన్నామని, రాజకీయలకతీతంగా అభివృద్ధి చేస్తున్నామని, రోడ్లు,డ్రైనేజి ,మంచి నీటి సమస్య లేకుండా చూస్తున్నామని తెలిపారు. కాలనీలు,బస్తీలోని సమస్యలు వెంటనే తమ దృష్టికి తీసుకరావాలని తెలిపారు.చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్,వేముకుంట కాలనీలలో డ్రైనేజీ,వీధి దీపాలు,లో ఓల్టేజ్ సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలోచందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి,జిహెచ్ఎంసి ఈఈ శ్రీకాంతిని,జలమండలి డిజిఎం నాగప్రియ, మేనేజర్లు సుబ్రమణ్య రాజు,సునీత,ఎఎంఓహెచ్ కార్తిక్,టౌన్ ప్లానింగ్ టిపిఎస్ మధు, ఎలక్ట్రికల్ ఏఈ రాజ్ కుమార్,సురేందర్,ఎస్ ఆర్ పి మహేష్,బాలాజీ,వర్క్ ఇన్స్పెక్టర్ హరీష్,మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్,మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, తెరాస నాయకులు మిరియాల రాఘవ రావు,జనార్దన్ రెడ్డి , వెంకటేష్ ముదిరాజు,దాసరి గోపి ,గుడ్ల ధన లక్ష్మి ,పులిపాటి నాగరాజు,మిరియాల ప్రీతమ్,రవీందర్ రెడ్డి,ఓ.వెంకటేష్ ,గోవర్ధన్,మల్లేష్,అక్బర్ ఖాన్,అంజద్ పాషా, దాస్ ,గిరి,ఇమ్రాన్,రైస ,ప్రవీణ్ రెడ్డి ,హరీష్,యశ్వంత్ ,ఖదీర్,కుమార్,అల్తాఫ్,సందీప్ రెడ్డి ,శ్రీధర్ ,వరలక్ష్మి,కార్తీక్ష కరెడ్డి ,పార్వతి, బీబీ, అనిత కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment