Home » నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోథెరపిక్ సబ్స్టేన్సెస్ ఆక్ట్ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీపీ స్టీఫెన్ రవీంద్ర

నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోథెరపిక్ సబ్స్టేన్సెస్ ఆక్ట్ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీపీ స్టీఫెన్ రవీంద్ర

by Admin
13.0kViews
114 Shares

తెలంగాణ మిర్రర్,సైబరాబాద్ : నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోథెరపిక్ సబ్స్టేన్సెస్ ఆక్ట్ 1985 ప్రొసిజరల్ హ్యాండ్ బుక్ ను గురువారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పోలీసు అధికారులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..ఎన్డిపిఎస్ ఆక్ట్ కేసులను దర్యాప్తు చేసే అధికారులకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.ముఖ్యంగా ఎన్ డి పి ఎస్ Actకి సంబంధించిన ముఖ్యమైన లీగల్ ప్రొవిజన్స్, ఇన్వెస్టిగేషన్ పద్ధతులు ప్రక్రియలను తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుందన్నారు.ఎన్ డి పి ఎస్ సెల్ సైబరాబాద్ సహకారం తో ఈ పుస్తకం కార్యరూపం దాల్చిందన్నారు .నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కు సంబంధించి దర్యాప్తు అధికారుల కోసం ఆచరణాత్మకమైన అందించడమే లక్ష్యంగా ఈ పుస్తకం రాయడం జరిగిందన్నారు.సమాజంలో నార్కోటిక్  సైకోట్రోపిక్ పదార్ధాల వినియోగం పెరుగుదల ఆందోళన కలిగించే విషయమన్నారు. నిషేధిత డ్రగ్స్ వాడకం వల్ల అనేక దుష్ప్రభావాలున్నాయన్నారు. ముఖ్యంగా ఇవి మెదడు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తాయన్నారు. మతిమరుపు/ జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఏకాగ్రత లోపించడం, ఇమ్యూన్ సిస్టం దెబ్బతినడం, బిహేవియరల్ మార్పులు, డిప్రెషన్, యాంగ్జైటీ, సూసైడల్ టెండెన్సీ కి దారి తీస్తాయన్నారు.ఈ పుస్తకం రాయడంలో సహకరించిన రిటైర్డ్ ఎస్పీ, ఓఎస్డి సైబరాబాద్ ఎం. మల్లా రెడ్డి కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
అలాగే ఎస్ . రవీందర్ ఏసిపి, సైబరాబాద్, ఏ రంగధం, సెంట్రల్ టాక్స్ సూపరింటెండెంట్, హైదరాబాద్ లను సీపీ అభినందించారు. ఈ పుస్తకావిష్కరణలో సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్, సైబరాబాద్ డిసిపి క్రైమ్స్ కల్మేశ్వర్ సింగన్వర్, విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డిసిపి నికితా పంత్, అడ్మిన్ డిసిపి యోగేష్ గౌతమ్, మాదాపూర్ డిసిపి శ్రీనివాస్ శిల్పవల్లి, బాలనగర్ డిసిపి సందీప్, శంషాబాద్ ఎసిపి నారాయణరెడ్డి, ఓఎస్డి మల్లారెడ్డి, PSIOC ఏసిపి రవీందర్, ఏడీసీపీకు, ఏసీపీలు ఇతర అధికారులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment