
1.1kViews
*పార్టీ జెండా ఆవిష్కరించిన కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధి గోపనపల్లిలోని కార్పొరేటర్ కార్యాలయం,నానక్ రాంగూడ బీజేపీ కార్యాలయం ఆవరణలో భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జెండాను కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాల్ ఉపధ్యాయ్, భరతమాత చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయవాదాన్ని నరనరాన నింపుకొని దేశం కోసం, పార్టీ కోసం ప్రాణాలర్పించిన కార్యకర్తలను స్మరించుకుంటూ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించేందుకు కృషి చేసిన బిజెపి నాయకులకు,కార్యకర్తలకు,అభిమాను లకు మద్దతుదారులందరికీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు గల రాజకీయ పార్టీ బిజెపి అన్నారు.దేశ శ్రేయస్సు కోసం శ్యామ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాల్ ఉపధ్యాయ్ ఆలోచనలతో బిజెపి ఆవిర్భవించిందన్నారు.తెలంగాణలో టీఆర్ఎస్ అరాచక పాలనను అంతమొందించి గొల్లకొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించడమే ధ్యేయమని అన్నారు. టీఆర్ఎస్ అవినీతి, కుటుంబ నియంత పాలనను ఎండగట్టేందుకు బిజెపి కార్యకర్తలంతా గడపగడపకూ వెళ్లి ప్రజలను చైతన్యం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గోపనపల్లి తండా వడ్డెర సంఘం ప్రెసిడెంట్ అలకుంట శ్రీరామ్, ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ అధ్యక్షులు బి.విటల్,ఎన్టీఆర్ నగర్ సొసైటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగ సుబ్రహ్మణ్యం, సీనియర్ నాయకులు వసంత్ కుమార్ యాదవ్, నర్సింగ్ నాయక్, దేవేందర్, రంగస్వామి ముదిరాజ్, విష్ణు, నర్సింగ్ రావు, క్రాంతి, శ్రీకాంత్, నరేష్, మొహసిన్, ఉదయ్, చిన్న, వివేక్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.