
తెలంగాణ మిర్రర్, గచ్చిబౌలి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధి లోని నవోదయ కాలనీలో ప్రజా సమస్యలపై శనివారం స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బస్తీబాట చేపట్టారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కాలనీ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కాలనీలో ప్రజల మౌలిక వసతులైన సీసీ రోడ్లు, వీధి లైట్లు, మంచినీటి సరఫరా, యూజీడీ తదితర సమస్యలను త్వరితగతిన తీరుస్తామని అన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో నవోదయ కాలనీ అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు, ఎలక్ట్రికల్ ఏఈ రాజశేఖర్, హెచ్ఎండబ్ల్యుఎస్ మేనేజర్ యాదగిరి, సూపర్ వైజర్ మోహన్, గోపనపల్లి తండా వడ్డెర సంఘం ప్రెసిడెంట్ అలకుంట శ్రీరామ్, కాలనీ సభ్యులు జీవనరాజు, బాలు, చంద్రశేఖర్, గిరి, ఫణింద్ర, అశోక్, వంశీ, శంకర్, ఖదీర్, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.