Home » నల్లగండ్లలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పంపిణీ

నల్లగండ్లలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పంపిణీ

by Admin
8.8kViews
140 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి :  సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్,విప్,శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు.శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నల్లగండ్లలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మూడవ విడతలో భాగంగా  1819 మంది లబ్ధిదారులకు విప్ అరెకపూడి గాంధీ,రంగారెడ్డి జిల్లా కలెక్టర్  హరీష్, తహసీల్దార్  శ్రీనివాసరావు, కార్పొరేటర్లు  గంగాధర్ రెడ్డి, పూజిత జగదీశ్వర్ గౌడ్ ,జగదీశ్వర్ గౌడ్,నార్నె శ్రీనివాస రావు, మంజుల రఘునాథ్ రెడ్డి,రోజా దేవి రంగరావులతో  కలిసి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రారంభించి ఇళ్ల పట్టాలను అందజేశారు..ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాత్రమే డబుల్‌ బెడ్‌రూ ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్నదన్నారు. సీఎం కేసీఆర్‌ విజన్‌ ఉన్న నేతగా, దేశానికే ఆదర్శంగా తెలంగాణలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని,పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూం పథకాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఉచితంగా ఇండ్లను అందజేస్తుందని చెప్పారు.పారదర్శకంగా ఇండ్ల విధానం చేపట్టామన్నారు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని, అందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలను గొప్పవారుగా చూడాలని సీఎం కేసీఆర్‌ చెప్పేవారని, అందులో భాగంగానే విలువైన భూముల్లో డబుల్‌ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చామన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయడంతో పాటు, ప్రజాసంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూస్తామని తెలిపారు. ఇండ్లు పొందిన వారు అమ్ముకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like

Leave a Comment