Home » దేశ సేవకై దీక్షబూనిన మోది : జ్ఞానేంద్ర ప్రసాద్

దేశ సేవకై దీక్షబూనిన మోది : జ్ఞానేంద్ర ప్రసాద్

by Admin
1.1kViews

వ్యాక్సినేషన్  సెంటర్ ను పరిశీలిస్తున్న జ్ఞానేంద్ర ప్రసాద్

మియపూర్ (తెలంగాణ మిర్రర్): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియపూర్ శివాలయం వద్ద మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ ను బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ ఉచితంగా టీకాలు (వాక్సినేషన్) సదుపాయాలు కలిపిస్తున్నారని ఈ సందర్భంగా వారికి మనం ధన్యవాదాలు తెలపాలి అని అన్నారు. దేశ ప్రజల ఆరోగ్యం గురించి మోడీ ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో అర్ధమవుతుంది అని అన్నారు.కరోనా నుంచి దేశ ప్రజలను కాపాడటమే కేంద్ర ప్రభుత్వం మొట్ట మొదటి ప్రాధాన్యత అని ప్రధాని మోడీ ప్రకటించారు అని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఉచిత వ్యాక్సిన్ ను తీసుకుకోని సమిష్టిగా కరోనా వ్యతిరేక పోరాటం చేయాలి అని ఆయన కోరారు. ప్రతి ఒక్కరు సామజిక దూరని పాటిస్తూ మాస్కులు,శానిటైజర్ ను తప్పకుండా వాడాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు మణిక్ రావు,బిఎస్ఎన్ ట్రస్ట్ చైర్మన్ కిరణ్ యాదవ్,నాయకులు లక్ష్మణ్,ప్రభాకర్, విజేందర్,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment