Home » దేవాలయ భూమి పూజలో పాల్గొన్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి 

దేవాలయ భూమి పూజలో పాల్గొన్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి 

by Admin
1.0kViews

తెలంగాణ మిర్రర్, గచ్చిబౌలి:  శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కేశవ్ నగర్ లో నూతనంగా నిర్మాణం చేతలపెట్టిన ఎల్లమ్మ దేవాలయ భూమి పూజ కార్యక్రమం లో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి  వట్టినాగులాపల్లి మాజీ సర్పంచ్ నగేష్ యాదవ్ ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ లో ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి ఎల్లప్పుడూ చేస్తానని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎదుటివారికి సేవ చేయడం తో పాటు, దైవభక్తిని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి గారు, సీనియర్ నాయకులు హరీష్ శంకర్ యాదవ్, నర్సింగ్ రావు, బిక్షపతి , ఈశ్వర, శైలు, యాదయ్య, బసవప్ప, రమేష్, శ్రీను, రాజు, గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు , కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like

Leave a Comment