
530Views
తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : దేవాలయాల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉందన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని విజేత కాలనీలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న హనుమాన్ దేవాలయం, శివాలయం నిర్మాణ పనులను శుక్రవారం శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని జిఎమ్ఆర్ తెలిపారు.