Home » దీప్తిశ్రీనగర్ లో నాలా విస్తరణ పనులను పరిశీలించిన విప్ గాంధీ

దీప్తిశ్రీనగర్ లో నాలా విస్తరణ పనులను పరిశీలించిన విప్ గాంధీ

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నాలా విస్తరణ పనులను చేపడుతు ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యలను శాశ్వత పరిష్కారం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఎమ్మెల్యే, విప్‌ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు.చందానగర్ డివిజన్ దీప్తిశ్రీ నగర్ లోని నారాయణ ఎన్క్లేవ్ వద్ద రూ.1 కోటి 55 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న నాలా విస్తరణ పనులను శనివారం జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముంపునకు శాశ్వత పరిష్కారం దిశగా నాలా విస్తరణ పనులను చేపట్టడంతో ప్రజలకు ముంపు సమస్య తీరనున్నట్లు చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పనుల్లో పురోగతి సాధించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్,జిహెచ్ఎంసి ఈఈ శ్రీకాంతిని, డీఈలు స్రవంతి,విశాలాక్షి,ఏఈ లు శివప్రసాద్ , ప్రతాప్ వర్క్ ఇన్స్పెక్టర్లు జగన్ ,ప్రసాద్ మరియు చందానగర్ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ,మాదాపూర్ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు రవీందర్ రెడ్డి, గురు చరణ్ దుబే,తదితరులు పాల్గొన్నారు.
కల్వర్టు నిర్మాణపనులు పరిశీలన ….
హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని మదినగూడా జాతీయ రహదారి వద్ద జరుగుతున్న నాలాపై కల్వర్టు నిర్మాణ పనులను ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి విప్‌ గాంధీ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులలో ఏమాత్రం నాణ్యతా లోపాలు లేకుండా చూడాలని సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.నాలాల్లో పేరుకుపోతున్న వ్యర్థాలను ఎప్పటికపుడు తొలగిస్తూ నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని విప్‌ గాంధీ అన్నారు.

You may also like

Leave a Comment