
*కోటి 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
తెలంగాణ మిర్రర్,అమీన్‌పూర్ : అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామని చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తెలిపారు.సోమవారం మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో కోటి 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక కౌన్సిలర్ కల్పన ఉపేందర్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో,శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో అమీన్‌పూర్ మున్సిపాలిటీ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులకు అధిక నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో స్థానిక ప్రజలు,ఆయా కాలనీ అసోసియేషన్ పెద్దల సూచనలు సలహాలు స్వీకరిస్తున్నామని తెలిపారు.సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత పాటించి,సకాలంలో పనులను పూర్తి చేయాలనీ కాంట్రాక్టర్ కు చైర్మన్ టిపిఆర్ సూచించారు.అనంతరం అదే కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని చైర్మన్ ప్రారంభించారు.