
1.3kViews
*అమీన్‌పూర్ పీజేఆర్ ఎన్క్లేవ్ లో భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
తెలంగాణ మిర్రర్,అమీన్‌పూర్ : అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు.శనివారం మున్సిపల్ పరిధిలోని పీజేఆర్ ఎన్క్లేవ్ లో రూ. 50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత మురికినీటి కాలువల నిర్మాణ పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని,రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు.అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు.