Home » త్వరితగతిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యని పరిష్కరించాలి…

త్వరితగతిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యని పరిష్కరించాలి…

by Admin
11.6kViews
72 Shares

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి :  శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందా నగర్ డివిజన్, తార నగర్ కాలనీ నుండి గోపీనాథ్ కాంప్లెక్స్ రోడ్డులో కొన్ని రోజుల క్రితం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పొంగిపొర్లుతున్న రోడ్డు మొత్తం డ్రైనేజ్ వాటర్ తో నిండిపోవడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంబంధిత అధికారికి తెలియజేయడం జరిగింది ,హెచ్ఎండబ్ల్యు ఎస్ఎస్బీ అధికారులు నామ మాత్రపు డ్రైనేజీ లైన్ శుభ్రం చేసి వెళ్ళడం జరుగుతుందని,వెంటనే డ్రైనేజీ లైన్ లో నిండిపోయిన చెత్తను తీసివేసి , శుభ్రం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, కొత్తగా లైన్ వేయాలని బిజెపి తరపున వినతీ పత్రం అందజేయడం జరిగింది, హెచ్ఎండబ్ల్యు ఎస్ఎస్బీ జీఎం రాజశేఖర్ స్పందిస్తూ,ఈ సమస్యని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలపడం జరిగింది, ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి బుచ్చిరెడ్డి , మజ్దూర్ మోర్చా జిల్లా అధ్యక్షులు వర ప్రసాద్ ,బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ తదితరులు  పాల్గోన్నారు.

You may also like

Leave a Comment