
తెలంగాణ మిర్రర్, శంకర్ పల్లి : శుభోదయం కార్యక్రమం భాగంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య గడపగడపను సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పరిధి లోని సంకేపల్లి గ్రామంలో శుభోదయం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శుభోదయం అనే కార్యక్రమం తో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని సమస్య పరిష్కరించడం చాలా సంతోషాన్ని కల్గిస్తుందని అన్నారు. గ్రామంలో పర్యటించి పలు రకాల సమస్యలను త్వరితగతిన పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా అర్హులైన లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంకేపల్లి సర్పంచ్ ఇందిరా లక్ష్మణ్, ఎం పి టి సి మేఘన సంజీవరెడ్డి, మండల స్థాయి అధికారులు, ఎంపీపీ, జెడ్ పి టి సి, సర్పంచులు ఎంపిటిసిలు టిఆర్ఎస్ నాయకులు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.