Home » త్వరలోనే రిజర్వాయర్ పనులు ప్రారంభం: అమీన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

త్వరలోనే రిజర్వాయర్ పనులు ప్రారంభం: అమీన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

by Admin
480Views

తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇంటింటికి రక్షిత మంచి నీరు అందించడమే లక్ష్యంగా మున్సిపల్ పరిధిలో భారీ రిజర్వాయర్లు నిర్మించబోతున్నట్లు అమీన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తెలిపారు.శుక్రవారం మున్సిపల్ పరిధిలోని లాలాబాయి కాలనీలో ఎకరా స్థలంలో 20 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో నిర్మించనున్న రిజర్వాయర్ స్థలాన్ని జలమండలి అధికారులతో కలిసి మున్సిపల్ చైర్మన్ పరిశీలించారు.త్వరితగతిన పనులు పూర్తిచేసి రిజర్వాయర్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు.మున్సిపల్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కమీషనర్ సుజాత,వార్డు కౌన్సిలర్ కృష్ణ ,కో ఆప్షన్ సభ్యులు తలారి రాములు, ఏఈ అమీరుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment