Home » తెలుగు భాషాభివృద్ధి, వికాసమే ధ్యేయంగా ముందుకు సాగాలి : నందమూరి లక్ష్మీ పార్వతి

తెలుగు భాషాభివృద్ధి, వికాసమే ధ్యేయంగా ముందుకు సాగాలి : నందమూరి లక్ష్మీ పార్వతి

by Admin
1.0kViews

శేరిలింగంపల్లి ( తెలంగాణ మిర్రర్)  :   తెలుగు భాషాభివృద్ధి,వికాసమే ధ్యేయంగా ముందుకు సాగాలి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు, సాంస్కృతిక అకాడమీ ఛైర్ పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు. తెలుగు సాహిత్య వేదిక ,ఎస్ వీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాల వేదికగా వజ్రభారతి అవార్డుల ప్రదానం, నాలుగు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రతెలుగు సాంస్కృతిక అకాడమి చైర్ పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి హజరయ్యారు. అంతర్జాలం ద్వారా వజ్రభారతి అంశంపై సుమారు నాలుగు రాష్ట్రాలలో1204 మంది కవులు, విద్యార్థులు పాల్గొని తమ సాహిత్య ప్రతిభను చాటారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఆదిలాబాద్ జిల్లా నుండి రెండు వందల యాభై రెండు మంది వ్యాసరచన శ్రీకాకుళం జిల్లా నుండి కొత్తపేట గవర్నమెంట్ స్కూల్ నుండి వంద మంది అయ్యప్ప స్కూల్ నుండి బెంగుళూరు వందమంది డ్రాయింగ్స్ ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా రాష్ట్రాల నుండి సుమారు స్కూల్ విద్యార్థులు తొమ్మిది పది తరగతులు రెండు యాభై రెండు మంది పాల్గొన్నారు తెలుగు వెలుగు సభ్యులు ఐదువందల మంది పాల్గొన్నారు అందులో ఉత్తమ కవితలుగా యాభై ఎంపిక చేశారు. ఎంపికైన కవులు దాదాపు 52 మంది కవుల పేర్లు ను డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి చదివి వినిపించారు. ఇందులో భాగంగా వజ్రభారతి పుస్తకావిష్కరణ జరిగింది. ప్రముఖ కవి రచయిత విశ్లేషకులు లంక వెంకట స్వామి చేతుల మీదుగా సంకలనాన్ని ఆవిష్కరించారు ప్రముఖ కవి రచయిత హాస్యకవి వికటకవి తెలుగువెలుగు సాహిత్య వేదిక అధ్యక్షులు మూర్తి రచించిన ఏ గుండె తట్టిన పుస్తకాన్ని డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి సమక్షంలో కవి రచయిత విశ్లేషకులు కిలపర్తి దాలి నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు ప్రముఖ కవయిత్రి పాండ్రంగి శారదా రచించిన కవిత రేఖలు పుస్తకాన్ని ప్రముఖ రచయిత విశ్లేషకులు డప్పు వాయిద్య కళాకారులు మీసాల చిన గౌరి నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. అనకాపల్లికి చెందిన ప్రముఖ కవయిత్రి కే సీతాలత రచించిన జీవనరేఖలు పుస్తకాన్ని ఎస్ వీ ఫౌండేషన్ చైర్మన్ తెలుగువెలుగు ప్రధానకార్యదర్శి మోటూరి నారాయణ రావు చేతులు మీదుగా ఆవిష్కరించబడింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు, సాంస్కృతిక అకాడమీ చైర్ పర్సన్ డాక్టర్ లక్ష్మీపార్వతి మాట్లాడుతూ. తెలుగు భాష అమృతతుల్యమైన భాషని, ఆమె తెలిపారు. పరభాషా వ్యామోహం మోజులో తెలుగు భాష అంతరించిపోతునైన దశకు చేరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు, సాంస్కృతిక అకాడమీ తరపున మృగ్యమౌతున్న మాతృభాషను పునర్జీవింపచేసేందుకు తమ వంతు ప్రభుత్వంతో చర్చలు జరిపి భాష వికాసం కోసం కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. ప్రముఖ కవులు కీలపర్తి దాలి నాయుడు, లంకా వెంకట స్వామి గంటా మనోహర్ రెడ్డి, పిళ్లా వెంకటరమణ మూర్తి అయ్యలసోమయాజుల ప్రసాద్ ,ముక్క సత్యనారాయణ, మీసాల చిన గౌరి నాయుడు మాట్లాడుతూ… తెలుగు వెలుగు సాహితీ వేదిక ద్వారా మాతృభాష వికాసం కోసం చేస్తున్న కృషిని ప్రశంసించారు. దేశ స్వాతంత్ర్య సముపార్జనకోసం ప్రాణత్యాగాలు చేసిన పోరాట యోధులను గుర్తు చేసుకున్నారు. ఈ సమావేశంలో తెలుగు వెలుగు సాహితీ వేదిక అధ్యక్షులు మూర్తి తొలి పలుకులు పలుకగా ఎస్ వీ ఫౌండేషన్ ఛైర్మన్, తెలుగు వెలుగు సాహితీ వేదిక ప్రధానకార్యదర్శి మోటూరి నారాయణ రావు సభాధ్యక్షులుగా వ్యవహరించారు .సమన్వయ కర్తలుగా నవనీత రవీందర్, బి హెచ్ వి రమాదేవి వ్యవహరించగా, చొప్పదండి రాధ ప్రార్థన గీతం, పాండ్రంగి శారద హరతి పాట పాడగా
మేడిశెట్టి యోగేశ్వర రావు ముగింపు పలుకులతో సమావేశం ముగించారు . ఈ కార్యక్రమంలో నాలుగు వందల ఎనభై మంది పాల్గొన్నారు.

You may also like

Leave a Comment