
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ గా నియమితులైన బీసీ కులాల ఆశాజ్యోతి, సామాజిక వేత్త, బీసీ ఉద్యమాల కీర్తి కిరీటం డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావును శిష్ట కరణం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు,జాతీయ శిష్టకరణ ఓబీసీ సాధన కమిటీ కన్వీనర్ శ్రీ డీ వీ కృష్ణారావు నాయకత్వంలో మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించటం జరిగింది. తెలంగాణ రాష్ట్ర శిష్టకరణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బి. విజయ్ కుమార్ , అడిషనల్ ప్రధాన కార్యదర్శి మోటూరి నారాయణ రావు, కోశాధికారి ఉరిటి పార్వతీశ్వర రావు,సంఘ ముఖ్య సలహాదారులు పార్ధసారధి, యం. శంకర్ పట్నాయక్ , టి. ప్రతాప్ రాజ్ కలిసి డాక్టర్ కృష్ణమోహన్ ను సత్కరించారు. తెలంగాణ బీసీ కమీషన్ చైర్మన్ గా డాక్టర్ కృష్ణమోహన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించబడటం ఓ చారిత్రాత్మక ఘట్టమని, బీసీలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అపురూప వరమని శిష్టకరణ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈలాంటి మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు .