Home » తెలంగాణ రాష్ట్ర గౌడ కార్మికులకు రూ.1000 కోట్ల మేర పింఛన్లు

తెలంగాణ రాష్ట్ర గౌడ కార్మికులకు రూ.1000 కోట్ల మేర పింఛన్లు

by Admin
10.5kViews
87 Shares

*గౌడ కార్మికులకు రూ. 1000 కోట్ల మేర పింఛన్లు..

*ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడి మరణిస్తే రూ. 46.75 కోట్ల మేర సాయం

*వైన్ షాపుల కేటాయింపులో 15% రిజర్వేషన్ అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

*చెట్టు పన్ను రద్దు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ..

*హరితహారంలో భాగంగా 3.80 కోట్ల ఈత, తాటి చెట్లు

*రాష్ట్ర గీత పనివారల సంఘం ద్వితీయ మహాసభల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ మిర్రర్, హైదరాబద్: రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8 ఏళ్లలో 50 ఏళ్ల వయసున్న గౌడ కార్మికులకు రూ. 1000 కోట్ల మేర పింఛన్లు అందించిన ఘనత కేవలం తెలంగాణ సర్కార్ కే దక్కుతుందన్నారు. తెలిపారు. హైదరాబాద్, పిర్జాదిగూడలో తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం ద్వితీయ మహాసభలు మరియు గీత పనివారల సంఘం 65వ వార్షికోత్సవ సభలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… దేశంలో మిగతా రాష్ట్రాల్లో కులవృత్తులకు అమలవుతున్న పథకాలు, తెలంగాణలో అమలవుతున్న పథకాలను పోల్చి చూడాలని కార్యక్రమానికి హాజరైన వామపక్ష నాయకులను మంత్రి కోరారు. ఏ రాష్ట్రంలో నైనా తెలంగాణలో ఇస్తున్నట్లుగా వృద్ధాప్య పింఛన్లు 2వేలు అందిస్తున్నారా అని మంత్రి ప్రశ్నించారు. కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నచోట తెలంగాణలో కులవృత్తులకు పేదలకు అమలవుతున్న సంక్షేమ పథకాలను పోల్చి చూడాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. కులవృత్తులకు సంబంధించిన ఏ సమస్యలున్న ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడి మరణిస్తే రూ. 46.75 కోట్ల మేర సాయం అందించినట్లు తెలిపారు. భవిష్యత్తులో గౌడ కార్మికులకు మోపెడ్లు కూడా అందిస్తామన్నారు. అన్ని కుల వృత్తులను కాపాడే అంశంలో సీఎం కేసీఆర్ ఎంతో ముందున్నారని దేశంలో మరే రాష్ట్రంలో కూడా ఇలాంటి అవకాశమే లేదన్నారు. గీత కార్మికులు ప్రమాదవశాత్తు చెట్టు నుంచి కిందపడి మృతి చెందితే గతంలో కేవలం రూ. 2 లక్షల ప్రమాద బీమా మాత్రమే ఇచ్చేవారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రూ.5 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రమాదం బారిన పడి దివ్యాంగులుగా మారిన వారికి కూడా రూ. 5 లక్షల బీమా సొమ్ము అందించి అండగా ఉంటున్నామన్నారు. కల్లువృత్తిగా ఉన్న గౌడ కులస్తులు అడగకపోయినా వైన్ షాపుల కేటాయింపులో 15% రిజర్వేషన్ అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ అంగీకరించారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వ్యక్తులకు కాకుండా కల్లు సొసైటీలకు రిజర్వేషన్లు అమలు చేస్తే గీత కార్మికుల కుటుంబాలకు మరింత న్యాయం జరుగుతుందని తాము ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. జాతికి నాగరికత నేర్పిన కులవృత్తులను ప్రభుత్వం ఆదుకుని అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. సహజ సిద్ధమైన కల్లు ద్వారా కిడ్నీ రోగాలను న్యాయం చేయడమే కాకుండా క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులను కూడా అరికట్టడం సాధ్యమని భీమ్లా నాయక్ అనే శాస్త్రవేత్త ఆధారాలతో సహా నిరూపించాడన్నారు.
గీత కార్మికులను వేధించకుండా వృత్తి ప్రశాంతంగా చేసుకునే వాతావరణం కేవలం తెలంగాణలో మాత్రమే కనిపిస్తోందని తెలిపారు. గీత కార్మికులను గత ప్రభుత్వాలు, అధికారులు తీవ్రంగా వేధించే వారని ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చేసామన్నారు.

చెట్టు పన్ను రద్దు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ…

తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌడ కార్మికుల నుంచి ఒక్క రూపాయి కూడా చెట్టు పన్ను వసూలు చేయని ఘనత మన ప్రభుత్వానికే దక్కిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. చెంతనే ఉన్న కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం కల్లు వృత్తినే నిషేధించి గౌడ కార్మికుల పొట్ట కొట్టిందని తెలిపారు. ప్రకృతి సిద్ధమైన దివ్య ఔషధమైన కల్లును ఎలా బందు చేస్తారని కర్ణాటక ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. అలాంటి వారిపై నిరసనలు, నిరాహారదీక్షలతో ఉద్యమం చేయాలన్నారు.

హరితహారంలో భాగంగా 3.80 కోట్ల ఈత, తాటి చెట్లు…

తాటి, ఈత వనాల్లో 3.80 కోట్ల చెట్లను హరితహారం లో భాగంగా నాటామన్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఈత తాటి వనాలను అభివృద్ధి చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. 25 నుంచి 30 లీటర్ల కల్లును అందించే 40 వేల గిరక తాటి చెట్లను తీసుకువచ్చి ప్రయోగాత్మకంగా నాటినట్లు తెలిపారు. పొట్టి తాటి చెట్లపై పరిశోధనలు చేసి భువనగిరిలో ఇటీవలే కొన్ని చెట్లను నాటినట్లు తెలిపారు. సహజసిద్ధమైన వీటి వల్ల అనేక రోగాలను దూరం చేస్తుందన్నారు. ముద్విన్, నందనం, చారకొండ, మునిపల్లిలో ఈత తాటి వనాలను ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో నీరాకు ఎవరూ ఊహించని స్థాయిలో డిమాండ్ వస్తుందని మంత్రి తెలిపారు. దేశంలో ఎక్కడా లేనట్లు రూ. 500 కోట్ల విలువైన భూమి, రూ.5 కోట్ల నిధులు గౌడ ఆత్మగౌరవ భవనానికి సీఎం కేసీఆర్ అందించారని దేశంలో ఎక్కడైనా గౌడ కురస్తుల సంక్షేమం కోసం ఇలాంటి కేటాయింపు జరిగిందా అని మంత్రి ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఆత్మగౌరవ భవనాలకు ఇంత ఖరీదైన స్థలాలు ఇచ్చారని ఆయన అడిగారు.

70 ఏళ్లలో కనీసం పాపన్న విగ్రహాలు కూడా ఏర్పాటు చేయలేదు…

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ కులస్తుల దైవమని అయితే 70 ఏళ్లలో కనీసం ఆయన విగ్రహాలు కూడా ఏర్పాటు చేయలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గతంలో పాపన్న చిత్రపటం ఏర్పాటు చేసుకొని జయంతి ఉత్సవాలు జరిపే వారని తాము అధికారంలోకి వచ్చిన తర్వాతనే అధికారికంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన జయంతి నిర్వహించుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. జయంతి తో పాటు వర్ధంతిని కూడా అధికారికంగా నిర్వహించడంతోపాటు ట్యాంక్ బండ్ పై ఆ మహనీయుని విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. సర్వాయి పాపన్న కేవలం గౌడ కులస్తుల కోసమే కాకుండా బడుగు బలహీన వర్గాల ప్రజలందరి కోసం పోరాడిన గొప్ప యోధుడని కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న పరిపాలించిన ప్రాంతంలో గ్రానైట్ పరిశ్రమలు రాళ్ల కోసం తవ్వకాలు జరిపితే ఆయన చరిత్ర కనుమరుగ అవుతుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతే శాశ్వతంగా ఆ ప్రాంతాన్ని పురావస్తు శాఖకు అప్పగించి సంరక్షిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గీతా పనివారల సంఘం అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, తెలంగాణ సీపీఐ పార్టీ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, పల్లె లక్ష్మణరావు గౌడ్, వేములయ్య గౌడ్, శ్రీరాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment