
తెలంగాణ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణ నుండి తైక్వాండో క్రీడాకారులకు నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చేందుకే ఈ తైక్వాండో సెలెక్షన్స్ నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ శివ్ శంకర్ తెలిపారు. మేడ్చల్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఆర్గనైజింగ్ సెక్రటరీ స్వామి ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా తైక్వాండో సెలెక్షన్స్ నిర్వహించారు. ఇందులో ప్రతిభాకనబర్చిన క్రీడాకారులకు మెడల్స్ ను బహుకరించారు. ఈ సందర్బంగా తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ శివ్ శంకర్ మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను గుర్తింపు ఉన్న క్రీడలు ఆడేల చూడాలని సూచించారు. పిల్లలు గుర్తింపు లేని ఆటలు ఆడడం వలన క్రీడారంగంలో వారికి గుర్తింపు లేకుండా పోయిందన్నారు. తెలంగాణ ను క్రీడారంగంలో ముందులనే ఉదేశంతోనే ఈ సెలెక్షన్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ దేవా, కోఆప్షన్ మెంబెర్ నవీన్ , నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.