Home » తెలంగాణ కు హరితహారం కార్యక్రమంలో రాగం నాగేందర్ యాదవ్

తెలంగాణ కు హరితహారం కార్యక్రమంలో రాగం నాగేందర్ యాదవ్

by Admin
1.1kViews

శేరిలింగంపల్లి (తెలంగాణ మిర్రర్) :  తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ కార్యక్రమం హరితహారం. దీనిలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్లోని ఆదర్శనగర్ కాలనిలో కమ్యూనిటీ హాల్ వద్ద జిఎచ్ఎంసి  ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో  రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని వివిధ రకాల పండ్ల మొక్కలు , ఔషద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ప్రాంతంలో పల్లెలు, పట్టణాల్లోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, పచ్చగా ఉండాలని, పల్లెలు అభివ్రుద్ది చెంది పట్టణాలుగా ఎదగాలి అన్నారు. పట్టణాలు ఆధునీకరణ కావలనే గొప్ప సంకల్పం తీసుకున్న వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్  అని కొనియాడారు. ఆకుపచ్చని ఆవరణ కోసం  ప్రజలందరూ పాల్గొని మొక్కలు నాటాలని, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీ. సోమదాస్ ,పాపిరెడ్డి కాలనీ అధ్యక్షుడు కొండలరెడ్డి , గోపినగర్ బస్తి కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, సత్యనారాయణ, సుధాకర్ రెడ్డి, రామనాధం, రామస్వామి, వెంకట చారి, ముజీబ్ , నాగేశ్వర రావు, ఆమీన్, గఫార్, శ్రీకాంత్ యాదవ్, శ్రీమతి. స్వరూపరాణి, మంజుల, దీప, వీణ, లక్ష్మీ నాయుడు,  జిఎచ్ఎంసి సిబ్బంది, శానిటేషన్   విభాగం జలందేర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment