
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పర్వదినం సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు సారె గా అందించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం వార్డ్ కార్యాలయంలో లో డీసీ శ్రీ వెంకన్న, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి బతుకమ్మ చీరలను పంపిణి చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ బతుకమ్మ పర్వదినం సందర్భంగా ఆడపడుచులకు సారెగా ఉచితంగా చీరలను అందచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నియోజకవర్గ అడపడచుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర లోని మహిళలు ముఖ్యంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం మహిళల గౌరవార్థం ఉచితం గా చీరల పంపిణి చేయడం జరిగింది అని ఈ బహుమతి రాష్ట్ర ప్రభుత్వం తరపున చీరల పంపిణీకి నియోజక వర్గం లో మహిళలకు అందించడం చాలా ఆనందం గా ఉంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. బతుకమ్మ పండుగా ద్వారా తెలంగాణ సంప్రదాయాన్ని చాటి చూపిన ఘనత మన ప్రభుత్వం కే దక్కిందని అని తెలియచేసారు. అదేవిధంగా దశాబ్దాలుగా దగాపడ్డ వస్త్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం జీవంపోసింది అని బతుకమ్మ పండుగ పూట సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన రాష్ట్ర సర్కారు. బతుకమ్మ పర్వదినం సందర్భంగా ఆడబిడ్డలకు పుట్టింటి సారెను అందిస్తూ మురిపిస్తున్నది . ఇందుకు సంబంధించిన చీరల తయారీని అప్పగించి నేత కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపుతున్నది అని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ మన్వి శానిటేషన్ సూపర్ వైజర్ జలంధర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ విరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు పద్మారావు, పొడుగు రాం బాబు, కృష్ణ యాదవ్, విరేశం గౌడ్, రమేష్, వేణు గోపాల్, యద గౌడ్, కెఎన్ రాములు, రమణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.