Home » తెరాస పార్టీ సంస్థాగత బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.

తెరాస పార్టీ సంస్థాగత బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.

by Admin
1.2kViews

*తెరాస పార్టీ సంస్థాగత బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.

*ప్రతి కార్యకర్తని కంటికి రెప్పలా చూసుకుంటాం..కార్యకర్తలు పార్టీ అభ్యున్నతికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి..

తెలంగాణ మిర్రర్, మాదాపూర్: మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ లో తెరాస సీనియర్ నాయకులు సహదేవ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెరాస పార్టీ కార్యాలయం ను స్థానిక  కార్పొరేటర్  జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్య మంత్రి కెసిఆర్ అని, తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు అని, తెరాస జెండా అన్ని వర్గాల ప్రజలందరి కి అండదండంగా నిలుస్తుంది అని, ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం లో తెరాస పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా తెరాస పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు మంచి క్రమశిక్షణ తో బాధ్యతాయుతంగా పని చేయాలని, పార్టీ నియమ నిబంధనలకు లోబడి పని చేసి పార్టీ గౌరవాన్ని మరింత ఇనుమడింప చేయాలని, పార్టీ ఆదేశాల ను శిరసవహించాలని , మీకు అప్పగించిన బాధ్యతలు క్రమశిక్షణ తో నెరవేర్చాలని , ప్రజలకు పార్టీ కి వారధిగా ఉండలని, పదవులు రాని వారు నిరాశ నిస్పృహలకు లోను కాకూడదని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం తప్పకుండా లభిస్తుంది అని కావున ప్రతి ఒక్కరు తెరాస పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు సిపాయిలగా కష్టపడి పని చేయాలని, పని చేసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా మంచి గుర్తింపు లభిస్తుంది అన్నారు. నాయకులు ఎల్లపుడు ప్రజల మధ్యే ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించే  వారీగా ఉండాలని, పార్టీ అభివృద్ధికి నిజాయితీగా పనిచేసే కార్యకర్తలను సముచిత స్థానం కలిపిస్తామని, పార్టీ కోసం కార్యకర్తలు, నాయకులూ సిపాయిలుగా పనిచేయాలని, ప్రభత్వ సంక్షేమ పథకాలను ప్రజలలోకి  తీసుకువెళ్లాలని, పార్టీ కి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని, డివిజన్  అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పడం జరిగినది, గౌరవంగా పనిచేయాలని అప్పుడే క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు గుర్తింపు వచ్చేలా పని చేయాలనీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. డివిజన్  అభివృద్ధికి తనవంతు కృషి చేస్తాని, మాదాపూర్ డివిజన్ పరిధిలోని కాలనీ లలో పూర్తి స్థాయిలో అన్ని రకాల మౌలికవసతులు కల్పించి మాదాపూర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, తెరాస నాయకులు బిక్షపతి ముదిరాజ్, మిద్దెల మాల్లారెడ్డి, రఘునాథ్, పద్మారావు, కృష్ణ యాదవ్, సయ్యద్ గౌస్, గోపాల్ నాయక్, ఎస్.సి సెల్ అధ్యక్షులు ఓ.కృష్ణ,అర్జున్,ప్రభు,రాజు,సెల్వరజ్, డివిజన్ యూత్ అధ్యక్షులు షేక్ ఖాజా,యూత్ నాయకులు గోపాల్, సుబ్రమణ్యం, జైపాల్, శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment