Home » తెరాస పార్టీ ప్లీనరీ సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన తెరాస నాయకులు

తెరాస పార్టీ ప్లీనరీ సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన తెరాస నాయకులు

by Admin
410Views

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి:  తెరాస పార్టీ ద్వి దశాబ్ది వేడుకల్లో భాగంగా హైటెక్స్ లో ఈ నెల 25న నిర్వహించే తెరాస పార్టీ ప్లీనరీ సమావేశం ఏర్పాట్ల పై  మంత్రి వర్యులు తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్  ఆదేశానుసారం మంత్రివర్యులు  సబిత ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు  రంజిత్ రెడ్డి,  మాజీ మేయర్  బొంతు రామ్మోహన్, కార్పొరేటర్  జగదీశ్వర్ గౌడ్  తో కలిసి పరిశీలించిన ప్లీనరీ ఆహ్వాన కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్  ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ  మాట్లాడుతూ ప్లీనరీ సమావేశానికి వచ్చే ప్రజా ప్రతినిధుల కోసం చేస్తున్న ఏర్పాట్లు, పార్కింగ్ విషయం పై పరిశీలించడం జరిగినది అని, ఆయా ఏర్పాట్లు సకాలం లో పూర్తి కావాలి. సభా వేదిక, వచ్చే వాళ్ళ కోసం పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్య లేకుండా, ప్రజలకు ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి పలు అంశాల మీద చర్చించామని అన్నారు.  త్వరితగతిన పనులు పూర్తి చేసి సకాలంలో అందుబాటులో కి వచ్చేలా నిర్ణీత కాలానికి ముందే ఏర్పాట్లన్నీ పూర్తి కావాలని సంబంధిత ఇంచార్జీ లకు సూచించారు. అలాగే అధికారులు, పోలీస్ ల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద వారికి పలు సూచనలు చేశారు. పార్కింగ్ ఏర్పాట్ల పై అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీసీ సుధాంష్, ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, ఇ ఇ శ్రీకాంతిని, డిఇ సరిత, ఏ ఇ ప్రశాంత్ వాటర్ వర్క్స్  డి జి ఎమ్ నారాయణ, మాజీ కార్పొరేటర్ రంగరావు, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు గోవర్దన్ రెడ్డి, భాస్కర్, దొంతి శేఖర్, రఘునాథ్, గౌస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment