Home » తెరాస పార్టీ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి : జ్ఞానేంధ్రప్రసాద్, గజ్జల యోగానంద్

తెరాస పార్టీ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి : జ్ఞానేంధ్రప్రసాద్, గజ్జల యోగానంద్

by Admin
450Views

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ లో బీజేపీ నుంచి కొంతమంది టీఆర్ఎస్ లోకి చేరారని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని,అసత్య ఆరోపణలు చేయడం సరికాదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, శేరిలింగంపల్లి ఇంచార్జి గజ్జల యోగానంద్ అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే గులాబీ ఎంపీ, ఎమ్మెల్యేతో కండువా కప్పించి బిజెపి నుంచి చేరారని అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. పార్టీలో చేరిన వారికి బిజెపి పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని, అసలు మా పార్టీ కార్యకర్తలు కాదుకదా కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేదని ఎద్దేవా చేశారు. ప్రజలంతా బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారని, బిజెపికి పెరుగుతున్నమద్దతు చూసి ఓర్వలేక ఇలాంటి దిగజారుడు రాజకీయలు చేస్తున్నారని విమర్శించారు.ఇకనైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని లేని పక్షంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షులు మాణిక్ రావు, నాయకులు విజేందర్, సిద్దు, వెంకట్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment