
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: తెలంగాణ ప్రజలకు అండా మన తెరాస పార్టీ జెండా తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సెప్టెంబర్ 2 న దేశ రాజధాని ఢిల్లీ లో తెరాస పార్టీ కార్యాలయంనకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల పరిధిలోని కాలనీ లలో, వాడవాడలలో అంగరంగ వైభవంగా తెరాస పార్టీ జెండా ఎగరవేయలని తెరాస పార్టీ శ్రేణులకు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అరెకపూడి గాంధీ మాట్లాడుతూ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటున్న శుభసందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశానుసారం సెప్టెంబర్ 2 న ఉదయం 9.00 గంటల నుండి తెరాస పార్టీ జెండా పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రధాన కూడలిలో డివిజన్ల పరిధిలలో ని అన్ని కాలనీ లలో వైభవంగా టి.ఆర్.ఎస్. పార్టీ జెండా పండుగ కార్యక్రమాలను నిర్వహించి గులాబీ జెండా ఎగురవేసి పండుగను విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. పార్టీ శ్రేణులందరు తెరాస పార్టీ జెండా పండుగను కార్పొరేటర్లు, తెరాస నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా కమిటి మెంబర్లు, బూత్ కమిటి మెంబర్లు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు అందరూ పాల్గొని తెరాస పార్టీ జెండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ గారు పిలుపునిచ్చారు. అదేవిధంగా కరోనా విస్తరణ నేపథ్యంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాలి, శాని టైజర్ వాడుతూ, భౌతిక దూరం పాటిస్తూ ఉండాలని, కోవిడ్ నిబంధనలకు లోబడి కార్యక్రమాలు జరుపవల్సిందిగా ఆయన కోరారు.