Home » తానా నారీ సాహిత్య భేరికి ప్రత్యేక అతిథిగా ఎంపికైన మోటూరి జయశ్రీ

తానా నారీ సాహిత్య భేరికి ప్రత్యేక అతిథిగా ఎంపికైన మోటూరి జయశ్రీ

by Admin
12.8kViews
124 Shares

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి : ఈనెల 24వ తేదీన నిర్వహించ నారీ సాహిత్య భేరి అంతర్జాతీయ శతాధిక కవయిత్రుల సమ్మేళనం కార్యక్రమానికి శేరిలింగంపల్లి కి చెందిన చెందిన మోటూరి జయశ్రీ ప్రత్యేక అతిథిగా ఎంపికయ్యారు . తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగ వరపు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వా హకుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ ఈ మేరకు అంతర్జాతీయ స్థాయిలో ప్రకటన విడుదల చేశారు. దాదాపు 14 గంటల పాటు నిర్విరామంగా జరిగే నారీ సాహిత్య భేరి సాహిత్య సమ్మేళనంలో భారత్ తో పాటు విశ్వ వ్యాప్తంగా 15 దేశాలకు చెందిన ప్రముఖ తెలుగు కవయిత్రులు, రచ యిత్రులు పాల్గొననున్నారు.ఇందులో మోటూరి జయశ్రీ తమ కవిత్వాన్ని వినిపించనున్నారు. అరుదైన గౌరవం, అవకాశం అందించిన తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగ వరపు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వా హకుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా అత్యంత ప్రతిష్టాత్మక తానా ప్రపంచ సాహిత్య వేదిక లో పాల్గొనేందుకు ప్రతిపాదించిన తెలుగు వెలుగు సాహిత్య వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి మోటూరి నారాయణరావు కు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సాహితీ వేత్తలు, సాహితీ సంస్థల ప్రతినిధులు శుభాకాంక్షలుతెలిపారు..

You may also like

Leave a Comment