Home » ఢిల్లీలో గులాబీ జాగీర్… పార్టీ జెండాను ఎగురవేసి సంబరాలు చేసుకున్న తెరాస నాయకులు

ఢిల్లీలో గులాబీ జాగీర్… పార్టీ జెండాను ఎగురవేసి సంబరాలు చేసుకున్న తెరాస నాయకులు

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి:  తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు మన ప్రియతమ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం సెప్టెంబర్ 2 న దేశ రాజధాని ఢిల్లీ లో తెరాస పార్టీ కార్యాలయంనకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న  శుభసందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సూచన మేరకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి  శ్రీ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశానుసారం తెరాస పార్టీ జెండా పండుగ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం అన్ని  డివిజన్ పరిధిలలో  తెరాస పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ల తో కలసి ముఖ్యఅతిథిగా పాల్గొని తెరాస పార్టీ జెండా ను ఆవిష్కరణ చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీ లో తెరాస పార్టీ కార్యాలయం శాశ్వత భవనం నిర్మాణం కొరకు ముఖ్యమంత్రి  కేసీఆర్ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరుపుకున్న  శుభసందర్భంగా గురువారం చరిత్రాత్మక రోజు అని, చరిత్రలో నిలిచిపోయే రోజు అని , గల్లీ నుండి ఢిల్లీ వరకు చేరిన గులాబీ గుబాళింపు, ప్రతి గుండె గుండెల్లో గులాబీ జెండా అని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెరాస జెండా శ్రీరామ రక్ష అని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. అదేవిదంగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత గత ఎనిమిది సంవత్సరాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. దేశం సంక్షోభంలో కొనసాగుతున్నప్పటికీ రాష్ట్రంలో పేదలకు అందుతున్న ప్రభుత్వ పథకాలు యధావిధిగా అందేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పేద వారు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చూసుకుంటుందని తెలిపారు. ఎంతోమంది త్యాగాలతో ప్రత్యేక రాష్ట్రం సాధ్యం అయిందని వారిని స్మరించుకునే అమరుల త్యాగాలతో, కెసిఆర్ మొక్కవోని దీక్షతో తెలంగాణ సాధ్యమైందని అన్నారు. అదేవిధంగా అమరుల త్యాగాలను కొనియాడారు, నాడు ఉద్యమ నేత, నేడు బంగారు తెలంగాణ అభివృద్ది ప్రదాతగా, తెలంగాణ రాష్ట్ర సాధకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో బంగారు తెలంగాణాకు బాటలు వేస్తూ ఏడేండ్ల రాష్ట్రం వందేళ్ల ప్రగతి పథంలో సంక్షేమంలో స్వర్ణయుగాన్ని తలపిస్తోందని అన్నారు.   అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ప్రగతిపథంలో రాష్ట్రం ముందుకు పయనిస్తున్న వేళ.. దేశం లో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి  కెసిఆర్ గొప్పతనం అని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్, కేసీఆర్ కిట్ వంటి అనేక సంక్షేమ పథకాల తో బంగారు తెలంగాణ దిశగా నడిపిస్తూ మన అందరికి ఆదర్శం అన్నారు. ఏడేండ్ల రాష్ట్రం వందేండ్ల ప్రగతిని సాధించిపెట్టి వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండగ అని, నీటి జలసిరులను కార్యదక్షతతో తీసుకువచ్చిన తెలంగాణ జాతిపిత కెసిఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్లు తెరాస నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment