
410Views
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: ఆడుకుంటానని ఇంటినుండి బయటకు వెళ్ళిన బాలుడు సంపులో పడి మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.ఈ మేరకు కుటుంబ సభ్యు లు శోక సంద్రంలో మునిగారు. ఈ సంఘటనకు సంబదించిన వివరాలను ఇన్స్‍పెక్టర్ క్యాస్ట్రోరెడ్డి తెలిపారు. చందానగర్ రాజీవ్ గ్రహకల్పలో నివాసం ఉంటున్న రాజు, అనుభాయ్ దంపతుల కుమారుడు అరుణ్ (7) మంగళవారం సాయంత్రం ఆడుకునేందుకు తోటి స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళాడు.రాత్రయిన బాలుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టు ప్రక్కల, బందువుల వద్ద వెదికిన ఫలితం లేకుండా పోయింది. అదే కాలనీకి చెందిన స్థానికులు అనుమానం వచ్చి సంపులో చూడటంతో మృతదేహం అందులో ఉన్నట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం తెలుపగా వారు వచ్చి బాలున్నిగుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.