Home » డివిజన్ లోని అన్నిపార్కులను అభివృద్ధి చేస్తా : కార్పొరేటర్ పుష్పనగేష్

డివిజన్ లోని అన్నిపార్కులను అభివృద్ధి చేస్తా : కార్పొరేటర్ పుష్పనగేష్

by Admin
1.1kViews

*ఏఈ తో కలిసి స్మశాన వాటికను పరిశీలించిన కార్పొరేటర్ 

తెలంగాణ మిర్రర్,రామచంద్రపురం : రామచంద్రపురం డివిజన్ లో అన్ని పార్కులను సుందరీకరిస్తున్నామని కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ అన్నారు.బుధవారం డివిజన్ లోని హిందూ వాటికలో జరుగుతున్న అభివృద్ధి పనులను హార్టికల్చర్ మేనేజర్ చంద్రకాంత్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ శ్మశానవాటిక ముఖ ద్వారం నుండి లోపలి వరకు మొక్కలను నాటి మహా ప్రస్థానంలా రూపొందించాలని అధికారిని కార్పొరేటర్ ఆదేశించారు.అదేవిధంగా త్వరలోనే డివిజన్ లో వార్డు కార్యాలయం మంత్రి చేతులమీదుగా ప్రారంభం కానున్న నేపథ్యంలో కార్యాలయం చుట్టూ సుందరీకరణ పనులు మొదలు పెట్టాలని కార్పొరేటర్ పుష్పనగేష్ చెప్పారు.రైల్వే ట్రాక్ వద్ద శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో స్థలంలో పార్కును అభివృద్ధి చేయాలని స్థానికులు కోరగా సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ మాట్లాడుతూ జోనల్ కమీషనర్ ప్రియాంక అలతో చర్చించి సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వెంట అధికారి ఏఈ ప్రభు,సీఎం మల్లేష్,రాగం యాదయ్య,బేకరీ శంకర్,బుల్ల అశోక్,బంటు నర్సింహా,సిహెచ్ నాగ రాజు,సుధాకర్,బ్యాగరి బాలరాజు స్వామి,బేగరి నర్సింహా తదితరులు ఉన్నారు.

You may also like

Leave a Comment