Home » డివిజన్ అభివృద్ధి కి నిరంతరం తోడ్పడతాము : ఉప్పలపాటి శ్రీకాంత్

డివిజన్ అభివృద్ధి కి నిరంతరం తోడ్పడతాము : ఉప్పలపాటి శ్రీకాంత్

by Admin
510Views

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మాక్త మహబూబ్ పేట్ విలేజ్ లో నూతనంగా నిర్మిస్తున్నటువంటి  మంజీర మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులను జలమండలి అధికారులు, స్థానిక నాయకులతో కలసి పరిశీలిస్తున్న మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్. ఈ సందర్భంగా కార్పొరేటర్  మాట్లాడుతూ..మియపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి బస్తి,కాలనీ అభివృద్ధికి బాటలు వేస్తూ,పక్క ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి కెసీఆర్, మున్సిపల్ శాఖమంత్రి  కేటీఆర్, ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరేకపూడి గాంధీ   చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్.జి.రంజిత్ రెడ్డి  నాయకత్వంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ మౌళికవసతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు మేనేజర్ సాయి చరిత, వర్క్ ఇన్సెపెక్టర్ రమేష్ ,తెరాసనాయకులు గుండె దయనంద్ ముదిరాజ్, బాలమని,చారి,సురేష్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment