
తెలంగాణ మిర్రర్,మాదాపూర్ : పెయింటింగ్ రంగంలో టెక్నో పెయింట్స్ తనకంటూ ప్రత్యేక ఒరవడిని సృష్టించుకుంది. పెయింట్స్ తయారీలో ఉన్న టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటుడు మహేశ్‌బాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా టీవీ యాడ్ ను మహేష్ ఆవిష్కరించారు. మదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో నమ్రతా శిరోద్కర్, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మేఘా ఇంజనీరింగ్ సంస్థ డైరెక్టర్ బి.శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఫార్చ్యూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాసరెడ్డి టెక్నో పెయింట్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. అనంతరం ఫార్చ్యూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 22 సంవత్సరాల నుంచి సంస్థ నాణ్యమైన రంగులు, పెయింట్స్ సర్వీసులను ప్రజలకు అందిస్తోందన్నారు. బిజినెస్ టు బిజినెస్ విభాగంలో విజయవంతమయ్యామని, ఏపీ, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా ప్రాజెక్టులను పూర్తిచేశామని చెప్పారు. యూత్ ఐకాన్ గా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ తమ కంపెనీ విస్తరణకు దోహదపడుతుందని భావిస్తున్నామన్నారు.