Home » టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి కార్పొరేటర్లు పూజిత,జగదీశ్వర్ గౌడ్ లు

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి కార్పొరేటర్లు పూజిత,జగదీశ్వర్ గౌడ్ లు

by Admin
11.8kViews
128 Shares

 

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ మంగళవారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో జగదీశ్వర్ గౌడ్ దంపతులకు కండువా కప్పి పార్టీలోకి రేవంత్ ఆహ్వానించారు. పలువురు బీఆర్ఎస్ నేతలు పార్టీని విడిచిపెడుతున్నారు.శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాకిచ్చారు కార్పొరేటర్లు. బీఆర్ఎస్ కు మాదాపూర్, హఫీజ్పేట డివిజన్ల కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, పూజిత దంపతులు రాజీనామా చేశారు.ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగదీశ్వర్గౌడ్, పూజిత దంపతులు ఇవాళ జూబ్లీహిల్స్పెద్దమ్మ గుడిలో పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పూజలు చేస్తారు. ఆ తర్వాత భారీ ర్యాలీగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్లో చేరారు. జగదీశ్వర్ గౌడ్ కొంతకాలంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే టికెట్కోసం ప్రయత్నాలు చేశారు. అయితే బీఆర్ఎస్ అధిష్ఠానం మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేకే బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు.

You may also like

Leave a Comment