Home » టీఆర్ఎస్, అవినీతి, కుటుంబ పాలనను గద్దె దించడానికే ‘ప్రజా సంగ్రామ యాత్ర : బండి సంజయ్ కుమార్

టీఆర్ఎస్, అవినీతి, కుటుంబ పాలనను గద్దె దించడానికే ‘ప్రజా సంగ్రామ యాత్ర : బండి సంజయ్ కుమార్

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్, హైదరాబాద్: బీజేపీ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర  హైదరాబాద్ లో చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి నుండి శ్రీకారం చుట్టిన బండి సంజయ్ కుమార్. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఇంఛార్జ్‌ తరుణ్‌చుగ్ ఇతర సీనియర్ నేతలు, వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు.  భారత్ మాతా కీ జై, జై శ్రీ రాం, వందే మాతరం, రామ లక్ష్మణ జానకీ…జై భోలో హనుమాన్ కీ. వర్ధిల్లాలి నరేంద్ర మోదీ నాయకత్వం’’అంటూ సంజయ్ చేసిన నినాదాలకు సభకు హాజరైన వేలాది కార్యకర్తలు, ప్రజలంతా గొంతు కలపడంతో పాతబస్తీ యావత్తు హోరెత్తింది. అనంతరం బండి సంజయ్ కుమార్ ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. టీఆర్ఎస్ నియంత, అవినీతి, కుటుంబ పాలనను కూకటి వేళ్లతో పెకిలించేందుకే ‘ప్రజా సంగ్రామ యాత్ర చెప్పట్టామని, ఎంఐఎం గూండాలు, అవినీతి నియంత కేసీఆర్ గుండెలు బద్దలు కొట్టేలా నినదించాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్షం కోసం హిందూ ధర్మం కోసం పనిచేయాలని లక్ష్యంతో శ్రీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నా. మీ అందరినీ చూస్తుంటే అమ్మవారి అఖండ శక్తి ఇక్కడ నెలకొన్నట్లు ఉందన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర’ రాబోయే రోజుల్లో తెలంగాణ లో రాజకీయ ప్రకంపనలు స్రుష్టించడం ఖాయం. తెలంగాణ ప్రజలు కోరుకున్న మార్పు రావడం తథ్యం దీన్ని ఎవరు అడ్డుకోలేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం 1400 మంది అమరవీరులు బలిదానం చేసిండ్రు. రాష్ట్రం కోసం కాల్చుకున్నరు. ఉరేసుకున్నరు. 4 కోట్ల మంది ఆకాంక్షల కోసం ప్రాణ త్యాగం చేసిండ్రు. కానీ తెలంగాణ వచ్చినంక వారి ఆశలన్నీ ఆవిరైనయ్. ఒక్క కుటుంబమే రాజ్యమేలుతోంది. ఆ కుటుంబాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయడానికే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నా అన్నారు. కేసీఆర్ అద్భుతాలు స్రుష్టిస్తుండట. పక్క రాష్రంలో కేసీఆర్ ఎందుకు పుట్టలేదని అనుకుంటున్నారని టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఫ్రీ యూరియా ఇయ్యలేని దుర్మార్గపు సీఎం, రైతుల రుణమాఫీ ఇయ్యలేని మోసపు ముఖ్యమంత్రి, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేని, నిరుద్యోగ భ్రుతి ఇవ్వలేని నీచమైన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను తరిమితరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. మూడేళ్లుగా నిరుద్యోగ భ్రుతి ఇవ్వకుండా ఒక్కో నిరుద్యోగికి రూ.లక్ష బాకీ ఉన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి. 25 లక్షల మంది ఉద్యోగాల కోసం టీఎస్సీఎస్సీలో 40 లక్షల మంది ఎంప్లాయిమెంట్ ఎక్సేంజీలో నమోదు చేసుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉద్యమ కారులు ఉద్యమాల కోసం ఆత్మహత్య చేసుకుంటుంటే తెలంగాణ వచ్చినంక ఉద్యమకారులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి దాపురించిందంటే దీనికి కారణం ముమ్మాటికీ కేసీఆర్ అని లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల్లేక అల్లాడుతున్నరు. ఏడేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా.. ఈ మూర్ఖపు సీఎం పాలనలో ఒక్క తల్లి, చెల్లి అయినా అనందంగా ఉందా ఏ ఒక్క సామాజికవర్గమైనా సంతోషంగా ఉందా  రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే స్పష్టం చేయాలి. 125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీని గాలికొదిలేసి 100 రూములతో ప్రగతి భవన్ నిర్మించుకుని కులుకుతున్నడు.
దళితులకు సీఎం పదవి ఇస్తానని మోసం చేసిండు. బీసీలకు వందల కోట్లు ఇస్తానని మోసం చేసిండు. మతపరమైన రిజర్వేషన్లను అడ్డుపెట్టి ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేస్తున్న వ్యక్తి కేసీఆర్. ఈ కేసీఆర్, ఆయన కుటుంబమే రాజ్యమేలుతూ అన్ని వర్గాలను దారుణంగా మోసం చేస్తోంది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తన మంత్రివర్గంలో ఏకంగా 27 మంది బీసీలు, 12 మంది ఎస్సీ, 8 మంది ఎస్టీలు, 12 మంది మహిళలను మంత్రులుగా నియమించిన ఘనత బీజేపీదే అన్నారు. ఎన్నికలొచ్చినప్పుడు దొంగ హామీలిచ్చి ఎన్నికలయ్యాక ఫాంహౌజ్ కే పరిమితమై ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ను సాగనంపాలి. కోవిడ్ తో తెలంగాణ అంతా అల్లాడుతుంటే కేసీఆర్ సహా టీఆర్ఎస్, ఇతర పార్టీల నాయకులెవరూ సాయం చేయలేదు. చావుకు తెగించి కోవిడ్ బాధితుల వద్దకు వెళ్లి సహాయ కార్యక్రమాలు చేసిన ఘనత బీజేపీ కార్యకర్తలదే. ఈ మూర్ఖపు సీఎం పాలనలో ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నరు. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నరు. కానీ ఇవేవీ పట్టని కేసీఆర్……బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే విమర్శలు చేస్తుండ్రు. హిందూ ధర్మాన్ని కాపాడుతూ అందరి కోసం పనిచేసే పార్టీ బీజేపీ. ఈ రాష్ట్రంలో ప్రతి హిందువు గర్వంగా నేను హిందువుని గర్వించేలా చేస్తాం. పాతబస్తీ ఎవరి అడ్డా…తెలంగాణ రాష్ట్రం మాది. ఏ గల్లీకైనా వస్తాం…ఏ మూలకైనా వస్తాం. తాలిబన్ భావజాలమున్న ఎంఐఎం పార్టీని, వారికి సహకరిస్తున్న వాళ్లను  తెలంగాణ రాష్ట్రం నుండి తరిమి తరిమి కొట్టడమే బీజేపీ లక్ష్యం. ఇలాంటి కుహానా శక్తులను అడ్డుకుని తీరతాం. రంజాన్ వస్తే ఇఫ్తార్ ఇస్తం, బక్రీద్ వస్తే కలిసి పండుగ చేస్తాం కానీ ఏనాడూ బీజేపీ వ్యతిరేకించలేదు. కానీ దసరా, దీపావళి పండుగలొస్తే…..గణేష్ శోభాయాత్రను కనీసం స్వాగతించిన ఎంఐఎం నాయకులను ఏమనాలి హిందుగాళ్లు, బొందుగాళ్లు అని విమర్శించి కేసీఆర్ ను ఏమనాలి, నువ్వు నిజంగా హిందువైతే ఈ పాతబస్తీ గడ్డ నుండి శోభాయాత్రను, హనుమాన్ జయంతి యాత్రను నిర్వహించే దమ్ముందా
అమరవీరుల ఆకాంక్షల కోసం, దళిత, బడుగు, బలహీన వర్గాల కోసం బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తోంది. కేసీఆర్ నియంత, అవినీతి, కుటుంబ పాలనను పాతిపెట్టేందుకే ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నం. బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా స్వామిక తెలంగాణను, పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకే ఈ యాత్ర చేస్తున్నా. మీరంతా ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై క్రమశిక్షణ పాటిస్తూ దిగ్విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

You may also like

Leave a Comment