
తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ డాక్టర్ ప్రియాంక అల ని గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జోనల్ కమిషనర్ ప్రియాంక అల తో సమావేశమై గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్‌పల్లి, గోపన్‌పల్లి తండా, ఇందిరానగర్, కేశవనగర్, నేతాజీ నగర్, దర్గా, గౌలిదొడ్డి నల్లగండ్ల, అపర్ణ సరోవర్ లలో డ్రైనేజీ సమస్యను, నీటి సమస్యలు, రోడ్లు, పరిష్కారించాలని కొరారు. అనంతరం గోపన్‌పల్లి తండా లో నూతన కమ్యూనిటీ హాల్ కోరకు జోనల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, గోపనపల్లి తండ వడెర సంఘం ప్రెసిడెంట్ అలకుంట శ్రీరామ్, సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్, రంగస్వామి, నరేందర్ నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.