
తెలంగాణ, మిర్రర్, శేరిలింగంపల్లి : జాతీయ స్థాయి కోచ్ అయిన క్యాతం శ్రీకాంత్ యాదవ్ ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్ ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు ఏకైక తెలంగాణ రాష్ట్ర కుస్తీ పోటీల కోచ్ శ్రీకాంత్ యాదవ్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కుస్తీ పోటీ అనేది అనాది కాలం నుండి ప్రాచుర్యంలో ఉందని, శ్రీకృష్ణ యుగంలో మహాభారతంలో మల్ల యుద్ధాలు జరిగాయి. ఇది ప్రాచీన క్రీడా అని ఎంతో మంది గొప్ప గొప్ప మల్ల యోధులు కలిగిన ఈ క్రీడ రూపాంతరం చెంది రెజ్లింగ్ గా మారిందని అన్నారు.యువత క్రీడా రంగాల్లో మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పథకాలు సాధించాలని కోరారు.
అనంతరం శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ నా పేరు క్యాతంశ్రీకాంత్ యాదవ్. నా తల్లిదండ్రులు క్యాతం యాదయ్య యాదవ్ మరియు క్యాతం ఉమ, అన్న క్యాతం శ్రీశైలం యాదవ్, మరియు తమ్ముడు సతీష్ యాదవ్,తాత అడవయ్య యాదవ్.ఈ కార్యక్రమంలో పెద్దలు రాగం కృష్ణ యాదవ్, నేతాజీ నగర్ కు చెందిన నరేందర్ రెజ్లింగ్ శిక్షకుడు , పెరుగు రమేష్ యాదవ్, మధు, రంజిత్ కుమార్ రెడ్డి, పవన్ తదితరులు పాల్గొన్నారు.