
తెలంగాణ మిర్రర్, కొండాపూర్ : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదుబండ మొర్రిస్ గ్యారేజ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన జాక్వార్ డబ్ల్యుపి శానిటేరీస్ వ్యాపారాన్ని ముఖ్య అతిధులుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ , కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, సూర్య ఇంటర్నేషనల్ సీఏండి పెండ్యాల హరనాథ్ బాబు తో కలసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్ జాక్వార్ డబ్ల్యుపి శానిటేరీస్ ఎండి వహీద్ పటేల్ కు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జాక్వార్ సంస్థ సీనియర్ మేనేజర్ కె చంద్ర శేఖర్, తెలంగాణ రాష్ట్ర జాక్వార్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ క్రాంతి కుమార్ , జాక్వార్ డబ్ల్యుపి శానిటేరీస్ మేనేజింగ్ పార్టనర్స్ షేక్ అబ్దుల్ ముఝహిద్, మొహ్మద్ మతీన్ అలీ తదితరులు పాల్గొన్నారు.