Home » జహీర్ ఖాన్ ను తలపిస్తున్న అర్షదీప్

జహీర్ ఖాన్ ను తలపిస్తున్న అర్షదీప్

by Admin
1.4kViews

*పాక్ బ్యాటర్ అక్మల్ ప్రశంసలు

తెలంగాణ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ : భారత క్రికెట్ చరిత్రలో అద్భుతమైన ఎడంచేతి వాటం పేసర్లలో జహీర్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ లెజెండరీ పేసర్ తరువాత అంతగొప్ప పేసర్ భారత జట్టుకు దొరకలేదు. అయితే తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో యువ పేసర్ అరదీప్ సింగ్ బౌలింగ్ చూసిన కొందరు అతన్ని జహీర్తో పోలుస్తున్నారు. ఇదే విషయంపై పాక్ మాజీ స్టార్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ మాట్లాడుతూ.. అర్షదీప్ బౌలింగ్ను మెచ్చుకున్నాడు. ‘అర్షదీప్ అద్భుతమైన బౌలర్. అతన్ని చూస్తుంటే భారత్ కు మరో జహీర్ ఖాన్ దొరికాడని అనిపించింది. అర్షదీప్ దగ్గర పేస్, స్వింగ్ రెండూ ఉన్నాయి. తెలివైన బౌలర్, దానికితోడు మానసికంగా చాలా ధృడంగా ఉన్నాడు. పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ చేస్తున్నాడు. యువకుడైనా కూడా అతనిలో బౌలింగ్ మెచ్యూరిటీ బాగా కనిపిస్తోంది అని అక్మల్ పేర్కొన్నారు. కాగా ప్రపంచకప్ కోసం ప్రకటించిన భారత జట్టులో కూడా అర్షదీప్ సింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

You may also like

Leave a Comment