Home » జలమండలి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే గాంధీ

జలమండలి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే గాంధీ

by Admin
1.2kViews

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి:  శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సివరేజ్ వ్యవస్థ (డ్రైనేజి నిర్వహణ ) ను జిహెచ్ఎంసి నుండి జలమండలికి బదిలీ అయిన తర్వాత జరిగిన పనితీరు,విధి విధానాల పై జలమండలి అధికారులతో శుక్రవారం ప్రభుత్వ విప్ గాంధీ సమీక్షా సమావేశం జరిపిన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ మాట్లాడుతూ ప్రజల నుండి, వాట్సాప్ ల నుండి వచ్చిన పిర్యాదులు డ్రైనేజి పొంగుతున్న వంటి సమస్యల ను 95 శాతం పరిష్కరించామని, మిగతావి త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని జలమండలి అధికారులు ప్రభుత్వ విప్ గాంధీ కి చెప్పారు. వచ్చిన సమస్యల ను ఒక రోజు రెండు, మూడు రోజులలో పూర్తి చేశామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగినది. ఈ సందర్భంగా అధికారులను అభినందించి మరింత పనిచేయాలని ,ప్రజలకు ఏ సమస్య లేకుండా చూడలని, అదేవిధంగా వాటర్ ట్యాంకర్ల స్థితిగతులను తెలుసుకోవడం జరిగినది , మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగు నీరు అందించడం వలన వాటర్ ట్యాంకర్ల డిమాండ్ తగ్గినది అని ప్రభుత్వ విప్ గాంధీ గారు తెలియచేసారు. అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడలని, జలమండలి,జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయం చేసుకొని పనులు పూర్తి చేయాలని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు .జలమండలి ఆధ్వర్యంలో నిర్వహించే డ్రైనేజి నిర్వహణ వ్యవస్థను పటిష్టపర్చాలని, ఎటువంటి ఇబ్బందిలేకుండా సమస్యలను పరిష్కరించాలని, ప్రజలకు అనుసంధానకర్తలుగా ఉండి ఎటువంటి లోటు లేకుండా చూడాలని అధికారులను కోరడం జరిగినది, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేయాలనీ,ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు, ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, నా సహాయ సహకారాలు ఎల్లా వేళాల ఉంటాయి అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు జీఎం రాజశేఖర్ , డిజిఎం లు శ్రీమన్నారాయణ ,నాగప్రియ , మేనేజర్లు సుబ్రమణ్యం ,నివర్తి ,యాదయ్య, సందీప్, సాయి చరిత, ఈశ్వరి, సునీత తదితరులు పాల్గొన్నారు.

 

డ్రైనేజి సమస్య పరిష్కారానికి సంప్రదించాల్సిన జలమండలి కాల్ సెంటర్ ఫోన్ నంబర్ 155313 ,డివిజన్ల వారిగా జలమండలి అధికారుల ఫోన్ నంబర్ల వివరాలు:

1. సుబ్రమణ్యం చందనాగర్ మేనేజర్ -9989989045

2. నివర్తి మాదాపూర్ మేనేజర్ – 7995660978

3. సందీప్ కొండాపూర్ డివిజన్ మేనేజర్ – 9550731232

4. వెంకట్ రెడ్డి – గచ్చిబౌలి డివిజన్ మేనేజర్ – 7337350849

5. యాదయ్య శేరిలింగంపల్లి డివిజన్ మేనేజర్ – 9154297400

6.సాయి చరిత మియాపూర్ డివిజన్ మేనేజర్ – 9154866702

7. పూర్ణేశ్వరి , హఫీజ్పెట్ డివిజన్ మేనేజర్ -7331185747

8. సునీత దీప్తి శ్రీనగర్ మేనేజర్ – 9154867431

పైన పేర్కొన్న నంబర్ల కు గాని, జలమండలి కాల్ సెంటర్ కు గాని, వాట్సప్ గ్రూప్ కు గాని ,ఎమ్మెల్యే కార్యాలయం గాని సంప్రదిస్తే వెంటనే సమస్య పరిష్కరిస్తామని, ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

You may also like

Leave a Comment