Home » జనం మెచ్చిన మేనిఫెస్టో….కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

జనం మెచ్చిన మేనిఫెస్టో….కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

by Admin
10.6kViews
79 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : సంక్షేమంలో సీఎం కేసీఆర్ పాలన స్వర్ణయుగమ‌ని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో మరెక్కడా లేవు అని రాగం అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీ మేనిఫెస్టో భారతావనికే తలమానికంగా ఉందని ప్రశంసించారు. రాష్ట్రంలో కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం అని తేలిపోయిందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.పేదల సంక్షేమానికి పాటుపడుతూ, అహర్నిశలు కృషిచేస్తూ, అభివృద్ధి పథంలో నడిపిస్తూ, నేడు బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసి మరొకమారు చంద్రశేఖర్ రావు అత్యున్నత భావాలు గల పేదల పక్షపాతి అని అన్నారు.ఈ మేరకు సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ పార్టీ ఆఫీస్ ఆవరణలో బాణాసంచాలు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆనందాల డోలికలలో తేలియాడుతూ, ఉత్సాహభరితంగా బాణాసంచాలు కాలుస్తూ, ఆనందాన్ని ఒకరినొకరు పంచుకున్నారు. ఈ సందర్బంగా కేసీఆర్ గారు హ్యాట్రిక్ తధ్యమని తెలంగాణ సాధన ఉద్యమ నాయకుడు అందరి గుండెల్లో నిలిచిన మహానుభావుడని కొనియాడారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, కటిక రాంచందర్, వార్డు మెంబర్ శ్రీకళ, గోపాల్ యాదవ్, గడ్డం రవి యాదవ్, బస్వరాజ్, నయీమ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, వెంకటేశ్వర్లు, సుభాష్ రాథోడ్, యోగి, శ్రీనివాస్, మహేష్ చారీ, సాయినందన్, సాయి, మహిళా నాయకురాలు లక్ష్మి, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment