Home » జగదీశ్వర్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం : కార్పొరేటర్ పూజిత గౌడ్

జగదీశ్వర్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం : కార్పొరేటర్ పూజిత గౌడ్

by Admin
12.0kViews
122 Shares

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : జగదీశ్వర్ గౌడ్ ను ఆశీర్వదిస్తే ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటారని హఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత గౌడ్,హారిక గౌడ్ లు అన్నారు. మంగళవారం వారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ మద్దతుగా హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ,వైశాలి నగర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఒకసారి జగదీశ్వర్ గౌడ్ కు అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని కాలనీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ప్రజలంతా ఒకసారి ఆలోచించాలని, తెలంగాణ ఇచ్చిన పార్టీని ఆదరించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment