
తెలంగాణ మిర్రర్, వికారాబాద్: వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రం లో VRA లు చేస్తున నిరవదిక సమ్మె కు చౌడాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షులు అశోక్ కుమార్ మండల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వము శాసనసభ వేదికగా VRAలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
మండల కేంద్రం MRO కార్యాలయం బయట VRAలు తమ న్యాయమయిన డిమాండ్ల సాధన కొరకు చేస్తున్న నిరవధిక సమ్మెకు చౌడాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి నిండు శాసనసభలో గతంలో ప్రకటించిన విధంగా 2012 నుండి 2014 వరకు ప్రత్యక్షంగా APPSC నియమించిన VRAల సర్వీస్ ను రెగ్యూలరైజ్ చేయడంతో పాటుగా పేస్కేల్స్ GOను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన VRAలకు హెల్త్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పదవీ విరమణ పొందిన VRAలకు పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలని, అదేవిధంగా అర్హత కలిగిన VRAలకు ప్రమోషన్స్ ఇవ్వాలని, గతంలో నిండు శాసనసభలో ముఖ్యమంత్రి VRAలకు ఇచ్చిన హామీలను త్వరితగతిన నెరవేర్చి శాసనసభ గౌరవాన్ని కాపాడాలని చౌడపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో చౌడాపూర్ మండల అధ్యక్షులు అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షులు నరసింహ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటయ్య గౌడ్, సలీం, జిల్లా ఎస్టీ సెల్ సెక్రెటరీ రవి నాయక్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మహేందర్, మండల మైనార్టీ సేల్ అధ్యక్షులు రషీద్, సీనియర్ నాయకులు సాయి, బుచ్చయ్య, యాదయ్య, మాల్కపుర్ గ్రామ కమిటీ అద్యక్షులు హనుమంతు, మాందిపల్ గ్రామ కమిటీ అద్యక్షులు బుచ్చయ్య, మండల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.