
తెలంగాణ మిర్రర్, చేవెళ్ల : తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు కు శంకర్‌పల్లి మండలం నుంచి ఉద్యమ నాయకులు తరలి వెళ్లారు. చలో చేవెళ్ల కార్యక్రమంలో భాగంగా శంకర్‌పల్లి మండల తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు మోత్కుపల్లి అశోక్( జన్వాడ ) ఆధ్వర్యంలో ఆదివారం చేవెళ్లకి వెళ్లారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణాలు సైతం లెక్కపెట్టకుండా ఉద్యమం కోసం పనిచేసిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు. చేవెళ్ల నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సుకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేసినందుకు ఉద్యమ నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శంకర్‌పల్లి మండల నుండి తెలంగాణ ఉద్యమ నాయకులు పండితరావు, శ్రీనివాస్ ముదిరాజ్ , బద్ధం సాంబరెడ్డి, పరమేశ్వర్ గౌడ్, కొండ మానయ్య, హరికృష్ణ గౌడ్, బేగరి కుమార్, గంగాడ సంజీవ, బైండ్ల గోపాల్, మండలం మహిళా అధ్యక్షురాలు పద్మ,కమ్మరి ప్రభు,మోత్కుపల్లి వెంకటేష్,వీరస్వామి,లింగం సాయి, జహంగీర్, భక్తకర్ణి భక్తకన్ని ,గౌరీ తదితరులు పాల్గొన్నారు.