Home » చిన్నారులకు పతంగులు పంపిణీ చేసిన కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్

చిన్నారులకు పతంగులు పంపిణీ చేసిన కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్

by Admin
1.1kViews

తెలంగాణ మిర్రర్,పటాన్‌చెరు : భోగి పండుగ సందర్భంగా రామచంద్రపురం డివిజన్ ప్రజలకు  కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం  శ్రీనివాస్ నగర్ కాలనీలోని వార్డు కార్యాలయంలో చుట్టు పక్కల కాలనీలో ఉన్న  సుమారు 30 చిన్నారులకు కార్పొరేటర్  పతంగులను  పంపిణి చేశారు.అనంతరం వారితో సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ పుష్ప నగేష్ మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా చిన్నారులతో పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి పండుగ జరుపుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు బూరుగడ్డ నగేష్,చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment